100 పరుగులు చేసినా గొప్పే.. ఆసీస్ ఓపెనర్ కామెంట్స్
ABN , First Publish Date - 2020-12-29T10:55:13+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్సులో ఆసీస్ జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది.
మెల్ బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్సులో ఆసీస్ జట్టు 195 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ 326 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆటముగిసే సమయానికి 133/6తో నిలిచింది. అంటే భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు రెండు పరుగుల లీడ్‌తో ఉంది. ఆసీస్ పరిస్థితిపై మాట్లాడిన జట్టు ఓపెనర్ మాథ్యూ వేడ్.. ‘‘భారత బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ బౌలింగ్‌లో కనీసం 100 పరుగుల లీడ్ వచ్చినా గొప్పే. దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు’’ అని చెప్పాడు.