కరోనా వ్యాక్సిన్‌పై వాడా పరిశీలన!
ABN , First Publish Date - 2020-12-13T10:17:02+05:30 IST
కొవిడ్-19 వ్యాక్సిన్ సమ్మేళనాన్ని నిశితంగా పరిశీలిస్తామని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) ప్రకటించింది.

లండన్: కొవిడ్-19 వ్యాక్సిన్ సమ్మేళనాన్ని నిశితంగా పరిశీలిస్తామని ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) ప్రకటించింది. వాటిల్లో నిషేధిత ఉత్ర్పేరకాలుంటే డోపింగ్ అథారిటీలను అప్రమత్తం చేస్తామని తెలిపింది. ఏదైనా వ్యాక్సిన్‌లో ఇబ్బందికర పదార్థాలుంటే వెంటనే సమాచారం అందించమని సంబంధిత ఏజెన్సీలకు సూచించినట్టు తెలిపింది.