క్లాసిక్ సెంచరీ.. రహానేపై ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2020-12-27T18:16:15+05:30 IST

కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కెప్టెన్ రహానే ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి ఇన్నింగ్సులో భారతజట్టు టాప్ ఆర్డర్‌ను కోల్పోయినా..

క్లాసిక్ సెంచరీ.. రహానేపై ప్రశంసల వర్షం

ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా కెప్టెన్ రహానే ఆటతీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తొలి ఇన్నింగ్సులో భారతజట్టు టాప్ ఆర్డర్‌ను కోల్పోయినా.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ.. జట్టును పటిష్ట స్థితికి తీసుకు వెళ్లేందుకు రహానే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఆసీస్ బౌలర్ల నుంచి పరుగులు రాబడుతున్నాడు. ఈ క్రమంలో టెస్టుల్లో తన 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రహానే సెంచరీని ప్రశంసిస్తూ టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. చక్కని నేర్పుతో అద్భుతమైన సెంచరీ చేశాడని రహానేను సెహ్వాగ్ ప్రశంసించాడు. రహానే అంకితభావం, ఆటతీరు అమోఘమన్నాడు.Updated Date - 2020-12-27T18:16:15+05:30 IST