విరాట్ ఓ మోడల్..
ABN , First Publish Date - 2020-06-01T09:38:21+05:30 IST
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చూసేందుకు ఓ మోడల్‌లా కనిపిస్తాడని, అతడి ఫిట్‌నెస్ అమోఘమని మాజీ అంపైర్ ఇయాన్ గౌల్డ్ తెలిపాడు. ‘విరాట్ చాలా సరదాగా ఉంటాడు. పలుమార్లు నన్ను అనుకరించి నవ్వించేవాడు. అలాగే అతడ్ని చూస్తే
- మాజీ అంపైర్ ఇయాన్ గౌల్డ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చూసేందుకు ఓ మోడల్‌లా కనిపిస్తాడని, అతడి ఫిట్‌నెస్ అమోఘమని మాజీ అంపైర్ ఇయాన్ గౌల్డ్ తెలిపాడు. ‘విరాట్ చాలా సరదాగా ఉంటాడు. పలుమార్లు నన్ను అనుకరించి నవ్వించేవాడు. అలాగే అతడ్ని చూస్తే ఓ అందమైన మోడల్‌లా కనిపిస్తాడు. రెస్టారెంట్‌కు వెళ్లి అతడితో గంటల తరబడి మాట్లాడవచ్చు. అయితే కెరీర్ ఆరంభంలో అతను దురుసుగా ప్రవర్తించినా ఆ తర్వాత జెంటిల్‌మెన్‌లా మారాడు. ఇప్పుడు భారత జట్టుకు అతడు మరో సచిన్ టెండూల్కర్. జట్టు విజయాల బాధ్యత అతనిపైనే ఉంది’ అని గౌల్డ్ కొనియాడాడు.