కోహ్లీ వారిలా గొప్ప బ్యాట్స్‌మెన్ కాదు..: బంగ్లాదేశ్ బౌలర్

ABN , First Publish Date - 2020-05-11T01:19:17+05:30 IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమిన్ హొస్సెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక బంతికి పరుగు చేయలేకపోతే.. విరాట్ బౌలర్లతో

కోహ్లీ వారిలా గొప్ప బ్యాట్స్‌మెన్ కాదు..: బంగ్లాదేశ్ బౌలర్

ఢాకా: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై బంగ్లాదేశ్ బౌలర్ అల్ అమిన్ హొస్సెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక బంతికి పరుగు చేయలేకపోతే.. విరాట్ బౌలర్లతో స్లెడ్జింగ్ చేస్తాడని.. క్రిస్ గేల్, రోహిత్ శర్మ వంటి చాలామంది గొప్ప బ్యాట్స్‌మెన్లకు తాను బౌలింగ్ చేశానని కానీ, విరాట్ వారిలా కాదని అతను అన్నాడు. 


శనివారం ఓ లైవ్ ఛాట్‌లో అమిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి డాట్ బాల్ వస్తే.. అతను వెంటనే స్లెడ్జ్ చేస్తాడు. అతను ఇక్కడ నేను చెప్పలేని తప్పుడు పాదాలతో దూషిస్తాడు. బౌలర్‌పై మానసిక ఒత్తిడి పెంచాలని అతను ప్రయత్నిస్తాడు. నేను క్రిస్ గేల్, రోహిత్ శర్మ, శిఖర్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ చేశాను. కానీ, వాళ్లు ఎవరూ ఇలా ఉండరు. ఒక మంచి బంతి వేసినప్పుడు వాళ్లు మర్యాదగా డిఫెండ్ చేస్తారు. కోహ్లీ అలా కాదు.. అతని బౌలర్‌తో స్లెడ్జింగ్ చేస్తాడు’’ అని అమిన్ అన్నాడు. 


కొద్ది రోజుల క్రితం మరో బంగ్లాదేశ్ బౌలర్ రుబెల్ హోస్సెన్ కూడా కోహ్లీపై ఇటువంటి వ్యాఖ్యలే చేశాడు. ‘‘ఒకప్పుడు కోహ్లీ చాలా స్లెడ్జింగ్ చేసేవాడు. కానీ, జాతీయ జట్టులో అంతలా చేయడం లేదు. అండర్-19 జట్టులో ఉన్నప్పుడు అతను చాలా ఆవేశంగా ఉండేవాడు’’ అని రుబెల్ అన్నాడు.

Updated Date - 2020-05-11T01:19:17+05:30 IST