ఐసీసీ ఈ దశాబ్దపు జట్లు.. టీమిండియా ఆటగాళ్లకు పెద్దపీట!

ABN , First Publish Date - 2020-12-27T23:00:40+05:30 IST

ఐసీసీ ఈ రోజు ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్లలో టీమిండియా ఆటగాళ్లకు పెద్దపీట వేసింది. మూడు జట్లలోనూ భారత ఆటగాళ్లకు

ఐసీసీ ఈ దశాబ్దపు జట్లు.. టీమిండియా ఆటగాళ్లకు పెద్దపీట!

దుబాయ్: ఐసీసీ ఈ రోజు ప్రకటించిన ఈ దశాబ్దపు టీ20, వన్డే, టెస్టు జట్లలో టీమిండియా ఆటగాళ్లకు పెద్దపీట వేసింది. మూడు జట్లలోనూ భారత ఆటగాళ్లకు చోటు లభించగా, మూడు జట్లకూ ఇండియన్లే కెప్టెన్‌గా ఉండడం మరో విశేషం. ఈ దశాబ్దపు టీ20, వన్డే జట్లకు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని కెప్టెన్‌గా నియమించగా, టెస్టు జట్టుకు టీమిండియా ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీని ఎంపిక చేసింది.


ఈ దశాబ్దపు టీ20 జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు లభించగా, వన్డే జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీలను తీసుకుంది. అలాగే, టెస్టు జట్టులో విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. టీ20, వన్డే, టెస్టు జట్లు మూడింటిలోనూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చోటు లభించడం విశేషం.


ఈ దశాబ్దపు టీ20 జట్టు: రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, అరోన్‌ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్ష్‌వెల్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ


వన్డే జట్టు: రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, షకీబల్ హసన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్, లసిత్ మలింగ


టెస్టు జట్టు: అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కుమార సంగక్కర (వికెట్ కీపర్), బెన్‌స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్

Updated Date - 2020-12-27T23:00:40+05:30 IST