విరాట్‌ ‘గెట్‌ ఆన్‌ బైక్‌’!

ABN , First Publish Date - 2020-07-05T08:46:53+05:30 IST

అత్యుత్తమ ఫిట్‌నెస్‌ కలిగిన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ తన ..

విరాట్‌ ‘గెట్‌ ఆన్‌ బైక్‌’!

 కోహ్లీ కసరత్తుల వీడియోపై పీటర్సన్‌ 

న్యూఢిల్లీ: అత్యుత్తమ ఫిట్‌నెస్‌ కలిగిన క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లాక్‌డౌన్‌ సమయంలోనూ తన దినచర్య ఆపకుండా ఫిట్‌నెస్‌ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. తాజాగా కసరత్తులు చేస్తున్న ఓ వీడియోను విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తూ అందులో కనిపించాడు. దీనిపై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌.. కోహ్లీని ట్రోల్‌ చేయాలనుకున్నాడు. కసరత్తులు చేసినట్టే బైక్‌ కూడా రోజూ నడుపు అన్నట్టుగా.. ‘గెట్‌ ఆన్‌ బైక్‌’ అని విరాట్‌ వీడియోపై కామెంట్‌ పోస్ట్‌ చేశాడు. దీనికి ‘రిటైర్మెంట్‌ తర్వాత’ అని విరాట్‌ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇక.. ‘అంతగా బరువు లేనట్టుంది.. కోహ్లీ’ అని డేవిడ్‌ వార్నర్‌ ఈ వీడియోకు కామెంట్‌ పెట్టాడు. 

Updated Date - 2020-07-05T08:46:53+05:30 IST