ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరో తెలుసా?

ABN , First Publish Date - 2020-09-19T01:31:43+05:30 IST

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన వీరుడెవరో తెలుసా? ఇంకెవరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఐపీఎల్‌లో

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరో తెలుసా?

దుబాయ్: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన వీరుడెవరో తెలుసా? ఇంకెవరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఐపీఎల్‌లో మొత్తం 169 ఇన్నింగ్స్‌లలో ఆడిన కోహ్లీ 5,412 పరుగులు సాధించి ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అలాగే, మరో రెండు రికార్డులు కూడా అతడి పేరున నమోదయ్యాయి. అందులో ఒకటి ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు. 2016లో 16 ఇన్నింగ్స్‌లలో 973 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. రెండోది అత్యధిక సెంచరీల రికార్డు. 31 ఏళ్ల కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు (5) సాధించిన భారతీయుడిగా రికార్డును సొంతం చేసుకున్నాడు.  

Updated Date - 2020-09-19T01:31:43+05:30 IST