కోహ్లీ, ధోనీలకు ఐసీసీ అత్యున్నత పురస్కారాలు

ABN , First Publish Date - 2020-12-29T01:13:07+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నేడు ప్రకటించిన ఈ దశాబ్దపు ఆటగాళ్లలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, మాజీ సారథి

కోహ్లీ, ధోనీలకు ఐసీసీ అత్యున్నత పురస్కారాలు

దుబాయ్:  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నేడు ప్రకటించిన ఈ దశాబ్దపు ఆటగాళ్లలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీలు అత్యుత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. వన్డేల్లో అద్భుత రికార్డు కలిగిన కోహ్లీ.. ‘‘ఐసీసీ మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్’ అవార్డుకు దక్కించుకున్నాడు. అలాగే, ‘ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది డెకేడ్’‌కు ఎంపికైన కోహ్లీ ప్రతిష్ఠాత్మక ‘సర్ గ్యారీ సోబర్స్’ అవార్డును అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ‘ఐసీసీ మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్’ అవార్డు కొల్లగొట్టగా, ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్సర్ రషీద్ ఖాన్ ‘ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. 


టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ‘ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డెకేడ్’కు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బెల్‌ను అంపైర్ రనౌట్‌గా  ప్రకటించగా, అది అవుట్ కాదని గ్రహించిన ధోనీ అతడిని మళ్లీ క్రీజులోకి పిలిచి క్రీడా స్ఫూర్తి చాటినందుకు గాను ధోనీకి ఈ అవార్డు దక్కింది. మహిళా క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ మూడు కేటగిరీల్లోనూ అవార్డులు కొల్లగొట్టింది. ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్, వన్డే ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్, టీ20 ప్లేయర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డులు దక్కించుకుంది. 

Updated Date - 2020-12-29T01:13:07+05:30 IST