తప్పు ఒప్పుకున్న విరాట్ కోహ్లీ..!

ABN , First Publish Date - 2020-03-02T14:34:16+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. తత్ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను...

తప్పు ఒప్పుకున్న విరాట్ కోహ్లీ..!

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. తత్ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. అయితే.. ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ బాగానే చేశామని చెప్పుకొచ్చాడు. టీమిండియా బౌలర్ల కష్టానికి తగ్గట్టుగా బ్యాట్స్‌మెన్స్ రాణించకపోవడం దురదృష్టమని చెప్పాడు. రోహిత్ అందుబాటులో లేడని, తాను కూడా పరుగులు సాధించలేకపోయానని కోహ్లీ అంగీకరించాడు. తాము ఆశించినంతగా ఆటతీరును కనబర్చలేకపోయినట్లు ఒప్పుకుంటున్నామని కెప్టెన్ తెలిపాడు. తప్పులను తెలుసుకుని ముందుకెళతామని చెప్పాడు.


ఇదిలా ఉంటే.. టీమిండియా బ్యాట్స్‌మెన్స్ వైఫల్యం రెండో టెస్ట్‌లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. టెస్టు సిరీస్‌లో తొలిసారి భారత బౌలర్లు చెలరేగుతూ రెండు సెషన్లలోనే కివీస్‌ పది వికెట్లను నేలకూల్చారు. ప్రత్యర్థి టెయిలెండర్లు కాస్త పోరాడినా కోహ్లీసేనకు స్వల్ప ఆధిక్యం దక్కింది.. ఇక ఈసారైనా బ్యాట్స్‌మెన్‌ స్థాయికి తగ్గట్టు ఆడి న్యూజిలాండ్‌ను ఒత్తిడిలో పడేస్తారేమోనని అంతా ఆశించారు. ప్చ్‌.. ఏం లాభం.. మా ఆటతీరింతే అన్నట్టు క్రీజులోకి వచ్చినంత వేగంగా పెవిలియన్‌కు చేరారు.

Updated Date - 2020-03-02T14:34:16+05:30 IST