విరాట్ కోహ్లీ మెరుగుపడుతున్నాడు... అదే భయపెడుతోంది : స్టీవ్ స్మిత్

ABN , First Publish Date - 2020-06-22T20:12:11+05:30 IST

మన ప్రతిభపై మనమే డబ్బా కొట్టుకుంటే ఏం బాగుంటుంది. అదే మన గొప్పతనం గురించి ప్రత్యర్థి చెబితే..

విరాట్ కోహ్లీ మెరుగుపడుతున్నాడు... అదే భయపెడుతోంది : స్టీవ్ స్మిత్

కాన్‌‌బెర్రా: మన ప్రతిభపై మనమే డబ్బా కొట్టుకుంటే ఏం బాగుంటుంది. అదే మన గొప్పతనం గురించి ప్రత్యర్థి చెబితే.. ఆ మజానే వేరు. ప్రస్తుతం క్రికెట్‌లో అలాంటి పరిస్థితే ఉంది. భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ఆటతీరును, నాయకత్వ లక్షణాలను ప్రపంచంలోని క్రికెటర్లందరూ ప్రశంశిస్తున్న విషయం తెలిసిందే. అయితే సమకాలీన ప్రత్యర్థి అయిన స్టీవ్ స్మిత్ కూడా కోహ్లీని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడంటే కోహ్లీ ప్రతిభ ఎలాంటిదో ఆలోచించండి. ఇటీవల భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌తో జరిగిన  ఓ ఇంటర్వ్యూలో స్మిత్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.


స్మిత్ మాట్లాడుతూ, తమకంటే విరాట్ కోహ్లీ మెరుగుపడుతున్నాడని చెప్పాడు. ‘విరాట్ సమయం గడిచేకొద్దీ మరింత మెరుగుపడుతున్నాడు. అది ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది’ అని స్మిత్ విరాట్‌ను ఆకాశానికెత్తేశాడు. మరి కొద్ది రోజుల్లో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్ చాలా గొప్పగా ఉంటుందని, ఆ సిరీస్ కోసం వేచి చూస్తున్నానని స్మిత్ చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2020-06-22T20:12:11+05:30 IST