కరోనాపై పోరాటానికి మావొంతు సహాయం అందిస్తాము: విరుష్క

ABN , First Publish Date - 2020-03-30T16:59:08+05:30 IST

కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు తమ వొంతు సహాయంగా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందిస్తున్నారు.

కరోనాపై పోరాటానికి మావొంతు సహాయం అందిస్తాము: విరుష్క

ముంబై: కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు తమ వొంతు సహాయంగా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నటీనటులు, క్రికెటర్లు, క్రీడాకారులు ప్రభుత్వానికి తమ సహాయాన్ని అందించారు. తాజాగా ఈ లిస్ట్‌లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మ కూడా చేరారు. 


పీఎం-కేర్స్ ఫండ్‌కు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి తమ వొంతు సహాయాన్ని అందిస్తున్నామని విరాట్, అనుష్క ట్వీట్ చేశారు. ‘‘నేను, అనుష్క పీఎం-కేర్స్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయనిధి(మహారాష్ట్ర)కు తగిన మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నాము. ఎంతో మంది బాధని చూసి మా హృదయాలు చలించిపోయాయి. మా ఈ సహాయం కొంతవరకైనా.. బాధలోఉన్న మన తోటి పౌరలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’’ అంటూ విరాట్ ట్వీట్ చేశాడు. ఇదే ట్వీట్‌ని అనుష్క కూడా పేర్లు మార్చి ట్వీట్ చేసింది. 

Updated Date - 2020-03-30T16:59:08+05:30 IST