డిసెంబర్ నుంచి జీతాలు లేక.. వీసీఏ అంపైర్ల తిప్పలు

ABN , First Publish Date - 2020-05-09T23:09:50+05:30 IST

కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక రంగంపై పడిన నేపథ్యంలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అంపైర్లు.. ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

డిసెంబర్ నుంచి జీతాలు లేక.. వీసీఏ అంపైర్ల తిప్పలు

నాగ్‌పూర్: కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక రంగంపై పడిన నేపథ్యంలో విదర్భ క్రికెట్ అసోసియేషన్ అంపైర్లు.. ఐదు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ ఆరంభం కంటే ముందే వీళ్లకు జీతాలు అందకుడా.. కష్టాలు ఎదురుకుంటున్నారు. 2019లో ఆడిన మ్యాచ్‌లకు సంబంధించిన జీతాలు ఈ నెల మార్చి నెలలో అందాల్సింది. కానీ, అవి అందకపోవడంతో పాటు.. కరోనా వ్యాప్తి చెందడంతో.. అన్ని క్రీడా టోర్నమెంట్‌లు కూడా రద్దయ్యాయి. 


అయితే కొందరు అంపైర్లకు డిసెంబర్ 12న జీతాలు అందాయి. ఆ తర్వాత అంపైర్ ఎగ్జామ్‌లలో ఉత్తీర్ణత పొందిన వాళ్లు మ్యాచ్‌లు లేక.. జీతాలు లేక నానా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. బోర్డు సభ్యులను అంపైర్లు డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-05-09T23:09:50+05:30 IST