నిబంధనలు..మరింత కఠినం
ABN , First Publish Date - 2020-06-25T09:01:32+05:30 IST
కరోనా.. క్రీడా లోకాన్ని కుదిపేస్తోంది. ఆడ్రియా టూర్‌లో పాల్గొన్న ప్రపంచ నెంబర్‌వన్ జొకోవిచ్‌తోపాటు దిమిత్రోవ్, బోర్నా కోరిచ్‌లాంటి టాప్ ప్లేయర్లు కరోనా...

యూఎస్ ఓపెన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
న్యూయార్క్: కరోనా.. క్రీడా లోకాన్ని కుదిపేస్తోంది. ఆడ్రియా టూర్‌లో పాల్గొన్న ప్రపంచ నెంబర్‌వన్ జొకోవిచ్‌తోపాటు దిమిత్రోవ్, బోర్నా కోరిచ్‌లాంటి టాప్ ప్లేయర్లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో క్రీడావర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని త్వరలో జరగనున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టోర్నీ సందర్భంగా ఆటగాళ్లతోపాటు అతిథులు కూడా మాస్క్‌లు ధరించడాన్ని తప్పనిసరి చేయను న్నారు. ప్రాక్టీస్, మ్యాచ్‌ల సమయంలో మాత్రం ఆటగాళ్లకు మినహాయింపు ఉం టుంది. అమెరికా వచ్చే ముందు పరీక్షలు చేయించడంతోపాటు.. వారానికి ఒకసారి కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఆటగాళ్ల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షిస్తారు. అయితే, కఠిన నిబంధనల మధ్య టోర్నీ నిర్వహించడాన్ని గతంలో జొకో సహా కొందరు ఆటగాళ్లు విమర్శించారు. కానీ, ఆడ్రియా టూర్ చేదు అనుభవం దృష్ట్యా.. ఈ విషయంలో ఆటగాళ్ల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది.