కోహ్లీకి అంపైర్ వార్నింగ్.. ఏంటా పని అంటూ..

ABN , First Publish Date - 2020-03-02T23:57:41+05:30 IST

న్యూజిలాండ్ పర్యటన టీమిండియాకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. చివరిదైన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.

కోహ్లీకి అంపైర్ వార్నింగ్.. ఏంటా పని అంటూ..

క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ పర్యటన టీమిండియాకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఐదు టీ20లకు క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో రాణించలేదు. మూడు వన్దేలు, టెస్టుల్లో పేలవంగా ఆడి ఓటమినే చవిచూసింది. సోమవారం ముగిసిన రెండో టెస్టులో కూడా ఏడు వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. అయితే న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. నాలుగో ఓవర్లో కివీస్ ఓపెనర్లు సింగిల్ తీస్తుండగా.. భారత ఫీల్డర్ ‘టూ’ అంటూ అరిచాడు. ఇది విన్న అంపైర్ కెటిల్‌బరో ఆగ్రహం వ్యక్తంచేశాడు. వెంటనే టీమిండియా సారధి కోహ్లీతో మాట్లాడాడు. అలా చేయడం తప్పని హెచ్చరించాడు. అయితే తమ ఫీల్డర్ చేసిన పనిని కోహ్లీ సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు. కివీస్ ఓపెనర్లు రెండో పరుగు తీయడానికి ప్రయత్నిస్తే అప్రమత్తంగా ఉండాలని ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌కు సూచించే ప్రయత్నమే అదని వివరించాడు. కానీ ఈ వివరణను అంపైర్ అంగీకరించలేదు. ‘మీరు టూ అని అరవకూడదు. మీ వివరణ ఆమోదయోగ్యంగా లేదు. మళ్లీ అలా చేయొద్దు’ అని తేల్చిచెప్పాడు. 


Updated Date - 2020-03-02T23:57:41+05:30 IST