లోపల..చానా లోపల..

ABN , First Publish Date - 2020-10-31T10:19:00+05:30 IST

అవును. అంతా ఇంగ్లి్‌ష..లేదంటే భారత క్రికెటర్లు మాట్లాడే హిందీ తప్ప మరో భాష వినిపించని మెగా టోర్నీ ఐపీఎల్‌లో తెలుగు పలుకులు అభిమానులకు

లోపల..చానా లోపల..

ఐపీఎల్‌లో అంపైర్‌ తెలుగు పలుకులు

దుబాయ్‌: అవును. అంతా ఇంగ్లి్‌ష..లేదంటే భారత క్రికెటర్లు మాట్లాడే హిందీ తప్ప మరో భాష వినిపించని మెగా టోర్నీ ఐపీఎల్‌లో తెలుగు పలుకులు అభిమానులకు ఆహ్లాదం కలిగించాయి. ఈ ఘటన గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ ఐదో బంతిని చెన్నై పేసర్‌ సామ్‌ కర్రాన్‌ ఆఫ్‌స్టం్‌పకు దూరంగా వేశాడు. క్రీజులో ఉన్న దినేశ్‌ కార్తీక్‌ ఆడేందుకు ప్రయత్నించినా బంతి అందలేదు. బంతి కీపర్‌ ధోనీ చేతిలోకి వెళ్లగా..దానిని వైడ్‌గా భావించిన కార్తీక్‌ అదే విషయాన్ని అంపైర్‌ షంషుద్దీన్‌నుద్దేశించి ‘వైడ్‌...కాదా’ అని ప్రశ్నించాడు. అందుకు షంషుద్దీన్‌ ‘లోపల..చానా లోపల..కొంచెం గూడా కాదు’ అంటూ నవ్వుతూ తెలంగాణ యాసలో బదులిచ్చాడు. వారి మధ్య జరిగిన తెలుగు సంభాషణ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.


హైదరాబాదీయే..

50 ఏళ్ల చెట్టితోడి షంషుద్దీన్‌ హైదరాబాదీయే. 2012లో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య పుణెలో జరిగిన టీ20 ద్వారా షంషుద్దీన్‌ అంపైర్‌గా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మొత్తం 20 టీ20లు, 43 వన్డే మ్యాచ్‌లకు అతడు అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. 


Read more