కోహ్లీనా..? లేక ధోనీనా..? ఉమేశ్ యాదవ్ సమాధానం ఏంటంటే..

ABN , First Publish Date - 2020-06-07T00:55:33+05:30 IST

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి భారత క్రికెట్‌ని మరింత ముందుకు

కోహ్లీనా..? లేక ధోనీనా..? ఉమేశ్ యాదవ్ సమాధానం ఏంటంటే..

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరు కలిసి భారత క్రికెట్‌ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. ధోనీ కెప్టెన్‌గా టీం ఇండియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించగా.. అతని తర్వాత కెప్టెన్సీ పుచుకున్న విరాట్ ఈ విజయ పరంపరని కొనసాగిస్తున్నాడు. అయితే ఎంతోకాలంగా ధోనీ, కోహ్లీల మధ్య ఎవరు ఉత్తమ క్రికెటర్ అనే చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా టీం ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్‌కు కూడా ఈ ప్రశ్న ఎదురైంది. అయితే అందుకు ఉమేశ్ సరదాగా సమాధానం ఇచ్చాడు. ‘‘చాలా కష్టమండి.. దయచేసి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు’’ అని ఉమేశ్ నవ్వుతూ చెప్పాడు. 

Updated Date - 2020-06-07T00:55:33+05:30 IST