టీమిండియాకు మరో కష్టం

ABN , First Publish Date - 2020-12-28T23:01:13+05:30 IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. తొలి టెస్టులో గాయపడిన పేసర్ మహ్మద్ షమీ సిరీస్‌కు

టీమిండియాకు మరో కష్టం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. తొలి టెస్టులో గాయపడిన పేసర్ మహ్మద్ షమీ సిరీస్‌కు దూరం కాగా, ఇప్పుడు ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో నాలుగో ఓవర్ వేస్తున్న సమయంలో మోకాలి పిక్క గాయంతో విలవిల్లాడిన ఉమేశ్.. మైదానాన్ని వీడాడు. బీసీసీఐ మెడికల్ టీం అతడిని స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించింది. స్కానింగ్ అనంతరం అతడికి అయిన గాయం గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన ఉమేశ్ ఆసీస్ ఓపెనర్ జో బర్న్స్ వికెట్‌ను నేలకూల్చాడు. 


ఉమేశ్ గాయం పెద్దగా ఉన్నట్టు తేలితే కనుక ఈ సిరీస్ నుంచి అతడు తప్పుకోవడం ఖాయం. మిగతా రెండు టెస్టులకు ఉమేశ్ దూరమైతే నవ్‌దీప్ సైనీ, నటరాజ్‌లలో ఒకరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.

Updated Date - 2020-12-28T23:01:13+05:30 IST