పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2020-02-21T01:03:54+05:30 IST

పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌‌ చేసిన చిన్న పొరపాటుకు విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. విషయ పరిజ్ఞానం

పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌ను ఆటాడుకుంటున్న నెటిజన్లు

కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌‌ చేసిన చిన్న పొరపాటుకు విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. విషయ పరిజ్ఞానం లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడేందుకు వెళ్తూ తన పక్కన కూర్చున్న మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో అక్మల్ సెల్ఫీ తీసుకున్నాడు.


అక్కడితో ఊరుకోక.. దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ ‘మదర్ ఫ్రమ్ అనదర్ బ్రదర్’ అని క్యాప్షన్ తగిలించాడు. అంతే, నెటిజన్లకు చేతినిండా పనిదొరికినట్టు అయింది. ట్రోల్స్‌తో విరుచుపడ్డారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన అక్మల్ ఆ తర్వాత దానిని డిలీట్ చేశాడు. అయితే, అప్పటికే స్క్రీన్‌షాట్లు తీసిపెట్టుకున్న నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు. 


నిజానికి అక్మల్ క్యాప్షన్ ఉద్దేశం ‘తామిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ములాంటివాళ్లం’ అని చెప్పడం. కానీ చివరన తగిలించాల్సిన మదర్ అనే పదాన్ని ముందు తగిలించడంతో దాని అర్థం పూర్తిగా మారిపోయింది.  నెటిజన్లు కూడా ఇలానే ముందుది వెనక, వెనకది ముందు తగిలించి ట్వీట్లు చేస్తున్నారు. మచ్చుకు కొన్ని..


‘పాలసీ ఈజ్ ది బెస్ట్ ఆనెస్టీ’

‘ఇఫ్ బీయింగ్ క్రైమ్ ఈజ్ ఏ హ్యాండ్సమ్, దెన్ అరెస్ట్ మి’

‘డోంట్ ఫీడ్ ది హ్యాండ్ దట్ బైట్స్ యు’

‘ఇఫ్ ఆపర్ట్యూటినిటీ డజంట్ డోర్, బిల్డ్ ఎ నాక్’

యాన్ డాక్టర్ ఎ డే కీప్ ఆపిల్ అవే’

ఇలా రకారకాలుగా ట్వీట్ చేస్తూ ట్విట్టర్‌లో నవ్వులు పూయిస్తున్నారు. 

Updated Date - 2020-02-21T01:03:54+05:30 IST