ఓ గర్భిణికి ఇంతకంటే ఉత్తేజకరమైన ఆట ఉంటుందా?: అనుష్కశర్మ

ABN , First Publish Date - 2020-09-30T00:23:01+05:30 IST

ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ సగటు క్రికెట్ ప్రేక్షకుడికి కావాల్సినంత మజాను అందించింది. ఇరు

ఓ గర్భిణికి ఇంతకంటే ఉత్తేజకరమైన ఆట ఉంటుందా?: అనుష్కశర్మ

దుబాయ్: ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ సగటు క్రికెట్ ప్రేక్షకుడికి కావాల్సినంత మజాను అందించింది. ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం చివరికి బెంగళూరును వరించింది. సూపర్ ఓవర్‌కు చేరిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 8 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. 
నరాలు తెగేలా సాగిన ఈ మ్యాచ్‌పై బాలీవుడ్ నటి, కోహ్లీ భార్య అనుష్కశర్మ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఓ గర్భిణికి ఈ మ్యాచ్ కావాల్సినంత ఉత్తేజాన్ని ఇచ్చిందని పేర్కొంది. ఇంతకంటే కావాల్సింది ఇంకేం ఉంటుందని పేర్కొంది. సూపర్ విన్ తర్వాత కోహ్లీ, డివిలియర్స్ హగ్ చేసుకున్న ఫొటోతోపాటు ఆటగాళ్లు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్న ఫొటో, విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఆర్సీబీ బెంచ్ స్ప్లిట్ ఫొటో‌లను అనుష్క షేర్ చేసింది.   


Updated Date - 2020-09-30T00:23:01+05:30 IST