బిగ్ బ్రేకింగ్: టోక్యో ఒలింపిక్స్‌పై జపాన్ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2020-03-24T23:41:46+05:30 IST
ఈ యేడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో చివరి నిమిషంలో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎలాగైనా అనుకున్న సమయానికి ఒలింపిక్స్ నిర్వహించాలని మొదట్లో అనుకున్నప్పటికీ కరోనా తీవ్రత పెరగడంతో వాయిదా వేయక

టోక్యో: ఈ యేడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ ఏడాదికి వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలిన నేపథ్యంలో చివరి నిమిషంలో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఎలాగైనా అనుకున్న సమయానికి ఒలింపిక్స్ నిర్వహించాలని మొదట్లో అనుకున్నప్పటికీ కరోనా తీవ్రత పెరగడంతో వాయిదా వేయక తప్పలేదు. ఇప్పటికే ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన ముందస్తు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. జపాన్ సైతం దీనిపై చాలా ఖర్చు చేసింది. అయితే ఊహించని రీతిలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతుండటంతో జపాన్ వెనక్కి తగ్గక తప్పలేదు.