టోక్యో ఒలింపిక్స్‌లో థాయ్‌లాండ్, మలేసియా లిఫ్టర్లకు నో చాన్స్
ABN , First Publish Date - 2020-04-07T10:04:23+05:30 IST
థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టర్లు టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. ఎందుకంటే, ఈ రెండు దేశాల లిఫ్టింగ్ సమాఖ్యలపై నిషేధం విధిస్తూ ...

న్యూఢిల్లీ: థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టర్లు టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. ఎందుకంటే, ఈ రెండు దేశాల లిఫ్టింగ్ సమాఖ్యలపై నిషేధం విధిస్తూ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర సమాఖ్య (ఐఎమ్‌ఎ్‌ఫసీపీ) నిర్ణయం తీసుకుంది. థాయ్‌లాండ్‌పై మూడేళ్లు, మలేసియాపై ఏడాదిపాటు నిషేధం విధించింది. ఈ రెండు దేశాల లిఫ్టర్లు రికార్డుస్థాయిలో డోపీలుగా పట్టుబడడంతో వేటు వేసింది. దీంతో వచ్చే ఏడాది జరిగే టోక్యో విశ్వక్రీడల్లో థాయ్, మలేసియా లిఫ్టర్లు పోటీపడే అవకాశం లేదు.