థామ్‌స-ఉబెర్‌ కప్‌ జరిగేనా?

ABN , First Publish Date - 2020-09-12T08:56:55+05:30 IST

ప్రతిష్ఠాత్మక థామ్‌స-ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో జట్ల ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది...

థామ్‌స-ఉబెర్‌ కప్‌ జరిగేనా?

టోర్నీ నుంచి ఇండోనేసియా, కొరియా అవుట్‌ 

జకర్తా: ప్రతిష్ఠాత్మక థామ్‌స-ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో జట్ల ఉపసంహరణల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌, తైవాన్‌, ఆస్ట్రేలియా దేశాలు ఈ టోర్నీ నుంచి వైదొలగగా.. తాజాగా టైటిల్‌ ఫేవరెట్‌ ఇండోనేసియాతో పాటు దక్షిణ కొరియా జట్లు తప్పుకోవడం సంచలనం సృష్టిస్తోంది. కరోనా వైరస్‌ విషయంలో తమ ఆటగాళ్లు ఆందోళన చెందుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇండోనేసియా బ్యాడ్మింటన్‌ సంఘం వెల్లడించింది. ఇక.. చైనా, జపాన్‌ జట్లు కూడా ఈవెంట్‌కు దూరమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇలా, వరుసగా జట్లన్నీ ఒక్కొక్కటిగా తప్పుకుంటుండడంతో ఈ టోర్నీని వాయిదా వేస్తారా? లేదంటే పూర్తిగా రద్దు చేస్తారా అన్న చర్చ బ్యాడ్మింటన్‌ వర్గాల్లో మొదలైంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ వచ్చేనెల 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరగాల్సి ఉంది. 

Updated Date - 2020-09-12T08:56:55+05:30 IST