మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో..‘ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే!

ABN , First Publish Date - 2020-02-12T09:31:39+05:30 IST

ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకొనే విధానాన్ని తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో అమలు చేయనున్నారు. ఈ నెల 21 నుంచి...

మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో..‘ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే!

దుబాయ్‌: ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌పై థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం తీసుకొనే విధానాన్ని తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో అమలు చేయనున్నారు. ఈ నెల 21 నుంచి ఆస్ట్రేలియాలో జరిగే మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ పర్యవేక్షిస్తాడని ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. భారత్‌, వెస్టిండీస్‌ సిరీ్‌సల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ‘ప్రతీ బంతినీ టీవీ అంపైర్‌ పరిశీలిస్తాడు. నోబాల్‌ అయితే ఫీల్డ్‌ అంపైర్‌కు సమాచారం అందిస్తాడు. ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ విషయంలో ఫీల్డ్‌ అంపైర్‌ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించామ’ని ఐసీసీ తెలిపింది. ప్రయోగాత్మకంగా పరిశీలించిన 13 మ్యాచ్‌ల్లో అంపైర్‌ నిర్ణయాలు కచ్చితంగా ఉన్నాయని చెప్పింది. 


Updated Date - 2020-02-12T09:31:39+05:30 IST