మళ్లీ బరిలోకి మొమోటా

ABN , First Publish Date - 2020-12-10T09:06:22+05:30 IST

కిందటి ఏడాదిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆటకు దూరమైన జపాన్‌ స్టార్‌ షట్లర్‌ కెంటో మెమోుటా మళ్లీ బరిలోకి దిగనున్నట్టు బుధవారం ప్రకటించాడు...

మళ్లీ బరిలోకి మొమోటా

టోక్యో: కిందటి ఏడాదిలో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆటకు దూరమైన జపాన్‌ స్టార్‌ షట్లర్‌ కెంటో మెమోుటా మళ్లీ బరిలోకి దిగనున్నట్టు బుధవారం ప్రకటించాడు. ఈనెలలో జరిగే జపాన్‌ జాతీయ చాంపియన్‌షి్‌పలో తలపడనున్న వరల్డ్‌ నెంబర్‌ వన్‌ మొమోటా.. అనంతరం జనవరిలో జరిగే థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో అంతర్జాతీయ పోటీల్లోకి అడుగుపెట్టనున్నాడు. గత ఏడాది జనవరిలో మలేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా కెంటో కారు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో కారు డ్రైవర్‌ మరణించగా.. మొమోటా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ‘మళ్లీ బరిలోకి దిగనుండడం ఉద్వేగంగా ఉంది’ అని కెంటో బుధవారం పేర్కొన్నాడు. 

Updated Date - 2020-12-10T09:06:22+05:30 IST