సంయుక్త ఆధిక్యంలో హరికృష్ణ

ABN , First Publish Date - 2020-09-17T08:52:43+05:30 IST

సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ శుభారంభం చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన

సంయుక్త ఆధిక్యంలో హరికృష్ణ

చెన్నై: సెయింట్‌ లూయిస్‌ ర్యాపిడ్‌ అండ్‌ బ్లిట్జ్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ శుభారంభం చేశాడు. మంగళవారం రాత్రి జరిగిన మూడు ర్యాపిడ్‌ రౌండ్లలో హరి రెండు విజయాలు, ఒక డ్రాతో ఐదు పాయింట్లు సాధించాడు. తొలి గేమ్‌లో డొమిన్‌గుయోజ్‌ పెరెజ్‌ (అమెరికా)పై నెగ్గిన హరి.. అలీరెజా ఫిరోజ్జా (ఇరాన్‌)తో రెండో గేమ్‌ డ్రా చేసుకున్నాడు. మూడో గేమ్‌లో అలెగ్జాండర్‌ గ్రిస్చుక్‌ను ఓడించాడు. ఇక అరోనియన్‌ (అర్మేనియా) కూడా ఐదు పాయింట్లు దక్కించుకుని హరికృష్ణతో కలిసి సంయుక్త ఆధిక్యంలో నిలిచాడు. 

Updated Date - 2020-09-17T08:52:43+05:30 IST