కష్టాల్లో టీమిండియా... కెప్టెన్ కూడా ఔట్
ABN , First Publish Date - 2020-03-08T20:25:48+05:30 IST
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆశించిన రీతిలో బ్యాటింగ్ చేయడం లేదు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల...

మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఆశించిన రీతిలో బ్యాటింగ్ చేయడం లేదు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 34 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఒక ఫోర్ కొట్టి జొనసేన్ బౌలింగ్‌లో గార్డ్నర్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయింది. ఓపెనర్లు స్మృతి మందన(11), షఫాలీ వర్మ(2) కొద్ది పరుగులకే చేతులెత్తేశారు. రోడ్రిగ్యూస్ ఒక్క పరుగు కూడా చేయకుండానే జొనసేన్ బౌలింగ్‌లో నికోలా క్యారీకి క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టింది.
ఇలా టీమిండియా 50 పరుగుల లోపే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. 9 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. మ్యాచ్ గెలవాలంటే 65 బంతుల్లో 138 పరుగులు చేయాల్సి ఉంది. దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి క్రీజులో ఉన్నారు.