ఐదో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

ABN , First Publish Date - 2020-02-08T19:16:51+05:30 IST

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌతీ బౌలింగ్‌లో...

ఐదో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌతీ బౌలింగ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ షాట్‌కు యత్నించి హెన్రీ నికోలస్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. కేదార్ జాదవ్ 27 బంతుల్లో 9 పరుగులు చేశాడు. జాదవ్ ఔట్ కావడంతో రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు దిగాడు. టీమిండియా 25 ఓవర్లు ముగిసే సమయానికి 108 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా(24), మయాంక్ అగర్వాల్(3) పరుగులు మాత్రమే చేయడంతో మిడిలార్డర్‌పై ఒత్తిడి పడింది. విరాట్ కోహ్లీ కూడా 15 పరుగులకే ఔటయ్యాడు. గత మ్యాచ్‌ల్లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకున్న లోకేష్ రాహుల్ కూడా ఈ మ్యాచ్‌లో 4 పరుగులకే ఔటయ్యాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

Updated Date - 2020-02-08T19:16:51+05:30 IST