సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2020-03-08T20:53:29+05:30 IST

దక్షిణాఫ్రికా జట్టుతో మార్చి 12 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ...

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ

దక్షిణాఫ్రికా జట్టుతో మార్చి 12 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. శిఖర్ ధావన్, పృథ్వీ షా ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. భువనేశ్వర్ కుమార్, బూమ్రా, యుజ్వేంద్ర చాహల్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. మార్చి 12న మధ్యాహ్నం 1.30 గంటలకు ధర్మశాల స్టేడియంలో టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా తొలి వన్డే జరగనుంది. మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. టీమిండియా జట్టు పూర్తి వివరాలివి...


టీమిండియా జట్టు:

శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ర్పిత్ బూమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్.

Updated Date - 2020-03-08T20:53:29+05:30 IST