చెత్తగా బౌలింగ్ చేసిన కుల్దీప్‌కు అండగా ఇండియా ఫీల్డింగ్ కోచ్

ABN , First Publish Date - 2020-02-08T03:20:00+05:30 IST

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు

చెత్తగా బౌలింగ్ చేసిన కుల్దీప్‌కు అండగా ఇండియా ఫీల్డింగ్ కోచ్

ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు ఇండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ దన్నుగా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాడు. అలాంటిదేమీ లేదని, ఫిట్‌గానే ఉన్నాడని స్పష్టం చేశాడు. రెగ్యులర్‌గా ఆడకపోవడం వల్ల బహుశా అతడి బౌలింగ్‌ కొంత గాడితప్పి ఉండొచ్చన్నాడు.  


తొలి వన్డేలో కుల్దీప్ పది ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. చాలా రోజుల తర్వాత కుల్దీప్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. విదేశాల్లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణిస్తాడని, ఇండియా నంబర్ వన్ స్పిన్నర్ అని ఏడాది క్రితం టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసించాడు. సరిగ్గా 12 నెలల తర్వాత ఈ వారం మొదట్లో కుల్దీప్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.

Updated Date - 2020-02-08T03:20:00+05:30 IST