టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడితే ఐపీఎల్?
ABN , First Publish Date - 2020-05-09T10:11:01+05:30 IST
ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌పై..బీసీసీఐ ఆఫీసు బేరర్ల వీడియో..
న్యూఢిల్లీ: ఐపీఎల్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌పై..బీసీసీఐ ఆఫీసు బేరర్ల వీడియో సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారితో ఆ మెగా టోర్నీ వాయిదాపడే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. అదే జరిగితే..ఆ సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందని బోర్డు సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఇక..దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో ఈ ఏడాది తొలి అర్ధభాగం వరకు క్రికెట్ మ్యాచ్‌లకు అవకాశం లేదని సమావేశం అభిప్రాయపడింది.