అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్‌ కష్టమే!

ABN , First Publish Date - 2020-04-28T10:04:33+05:30 IST

ఐసీసీ గత వారం నిర్వహించిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో టీ20 వరల్డ్‌క్‌పపై ఎలాంటి చర్చ జరపలేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా ...

అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్‌ కష్టమే!

బీసీసీఐ

న్యూఢిల్లీ: ఐసీసీ గత వారం నిర్వహించిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో టీ20 వరల్డ్‌క్‌పపై ఎలాంటి చర్చ జరపలేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో అక్టోబరు-నవంబరుల్లో వరల్డ్‌కప్‌ (ఆస్ర్టేలియాలో) నిర్వహణ సాధ్యమయ్యేలా లేదని బీసీసీఐ అధికారి ఒకరు భావిస్తున్నాడు. ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పొట్టి వరల్డ్‌కప్‌ జరగడం ఆచరణ సాధ్యం కాదనిపిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడమన్న ఆలోచనే అవివేకం. టోర్నీలో పాల్గొనడానికి జట్లకు ఆయా దేశాలు అనుమతి మంజూరు చేస్తాయో కూడా తెలియదు’ అని ఆయన అభిప్రాయ పడ్డాడు. కాగా, పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు వరల్డ్‌క్‌పను వాయిదా వేయాలని ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ సూచించాడు.

Updated Date - 2020-04-28T10:04:33+05:30 IST