క్వార్టర్స్‌లో సుమిత్
ABN , First Publish Date - 2020-08-20T09:47:43+05:30 IST
భారత టెన్నిస్ సింగిల్స్ టాప్ ఆటగాడు సుమిత్ నగాల్ ప్రాగ్ ఓపెన్‌లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో

ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): భారత టెన్నిస్ సింగిల్స్ టాప్ ఆటగాడు సుమిత్ నగాల్ ప్రాగ్ ఓపెన్‌లో టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నగాల్ క్వార్టర్‌ఫైనల్ చేరాడు. ప్రీక్వార్టర్స్‌లో ఆరోసీడ్ సుమిత్ 5-7, 7-6(4), 6-3తో కిరి లెచెకాపై విజయం సాధించాడు. సెమీస్ బెర్త్ కోసం మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో సుమిత్ తలపడే అవకాశముంది.