నాకు ఎదురైన బలమైన ప్రత్యర్థి అతనే: స్టువర్ట్ బ్రాడ్

ABN , First Publish Date - 2020-05-11T04:09:28+05:30 IST

ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు.

నాకు ఎదురైన బలమైన ప్రత్యర్థి అతనే: స్టువర్ట్ బ్రాడ్

లండన్: ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇంగ్లండ్ జట్టులో తన బెస్ట్ సహచరుడని అభిమానులు ప్రశ్నించారు. దీనికి బెన్ స్టోక్స్‌ అని బ్రాడ్ బదులిచ్చాడు. అలాగే తనకు ఎదురైన అత్యంత బలమైన ప్రత్యర్థిగా ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను ఎంచుకున్నాడు. ‘అతనికి బంతులేయడానికి గొప్ప పథకం వేసుకోవాలి. బౌలింగ్ చాలా కష్టం చేస్తాడతను. అలాగే భారీ ఇన్నింగ్స్ ఆడటంలో దిట్ట’ అని స్మిత్ గురించి చెప్పుకొచ్చాడు.

Updated Date - 2020-05-11T04:09:28+05:30 IST