యోగాతో మరింత ఫిట్‌గా..

ABN , First Publish Date - 2020-06-22T09:31:28+05:30 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుతో పాటు ఇతర క్రీడా ప్రముఖులు ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యతను చాటారు. యోగా సాధన చేయడం ద్వారా క్రీడాకారులు మరింత ఫిట్‌గా

యోగాతో మరింత ఫిట్‌గా..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుతో పాటు ఇతర క్రీడా ప్రముఖులు ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యతను చాటారు. యోగా సాధన చేయడం ద్వారా క్రీడాకారులు మరింత ఫిట్‌గా తయారవు తారన్నారు. కుమార్తె సారా, కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌తో కలిసి మాస్టర్‌ యోగా చేశాడు. ఈ సందర్భంగా యోగా చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అందరం ఆరోగ్యకరమైన జీననశైలి కోసం ప్రతిన బూనుదామని సింధు ట్వీట్‌ చేసింది. మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ డ్రిల్‌ చేస్తున్న వీడియోను పోస్టు చేయగా.. భార్య గీత, కుమార్తెతో కలిసి యోగా చేస్తున్న ఫొటోలను వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పోస్ట్‌ చేశాడు. ఇక.. టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ తన పెంపుడు శునకంతో కలిసి యోగా చేస్తున్న ఫొటోలను నెట్‌లో పంచుకున్నాడు. యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ షూటర్‌ మనూ భాకర్‌, మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, గౌతమ్‌ గంభీర్‌, మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్లు చేశారు. 

Updated Date - 2020-06-22T09:31:28+05:30 IST