నిషేధం ముగిసె..కెప్టెన్సీ రేసులోకొచ్చె!

ABN , First Publish Date - 2020-03-30T10:01:24+05:30 IST

ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. మళ్లీ కెప్టెన్సీ రేసులో నిలిచాడు. 2018లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్మిత్‌పై అప్పట్లో క్రికెట్‌ ఆస్ట్రేలియా ...

నిషేధం ముగిసె..కెప్టెన్సీ రేసులోకొచ్చె!

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. మళ్లీ కెప్టెన్సీ రేసులో నిలిచాడు. 2018లో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్మిత్‌పై అప్పట్లో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఏడాది నిషేధంతో పాటు నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు రెండేళ్ల పాటు అనర్హుడిని చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆటగాడిగా జట్టులోకి వచ్చి చాలా కాలమైనా ఈ ఆదివారంతో స్మిత్‌పై ఉన్న కెప్టెన్సీ నిషేధం కూడా ముగిసింది. ప్రస్తుతం ఆసీస్‌ను టెస్టు ఫార్మాట్‌లో టిమ్‌ పైన్‌ నడిపిస్తుండగా.. పరిమిత ఓవర్ల జట్టుకు ఫించ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్టులకు స్మిత్‌ను కెప్టెన్‌గా చేసే అవకాశం ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. 

Updated Date - 2020-03-30T10:01:24+05:30 IST