వార్నర్‌ నోట ‘పోకిరి’ డైలాగ్‌

ABN , First Publish Date - 2020-05-11T09:55:56+05:30 IST

మొన్న బుట్టబొమ్మ.. నిన్న సన్నజాజి.. ఇప్పుడు పోకిరి డైలాగ్‌.. ఇలా వరుసగా దక్షిణాది సినిమా పాటలు, డైలాగులతో టిక్‌టాక్‌లో ...

వార్నర్‌ నోట ‘పోకిరి’ డైలాగ్‌

హైదరాబాద్‌: మొన్న బుట్టబొమ్మ.. నిన్న సన్నజాజి.. ఇప్పుడు పోకిరి డైలాగ్‌.. ఇలా వరుసగా దక్షిణాది సినిమా పాటలు, డైలాగులతో టిక్‌టాక్‌లో అదరగొడుతున్నాడు ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడైన వార్నర్‌.. టాలీవుడ్‌ హీరో మహే్‌షబాబు నటించిన పోకిరి సినిమాలోని ‘ఒక్కసారి కమిటైతే.. నా మాట నేనే వినను’ అన్న డైలాగ్‌తో టిక్‌టాక్‌ వీడియో చేసి అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు.. ఈ డైలాగ్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండంటూ పోస్ట్‌ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి పోకిరి దర్శకుడు పూరి జగన్నాథ్‌ స్పందించాడు. ‘వార్నర్‌.. డైలాగ్‌ను చక్కగా పలికావ్‌. నీలో నటుడయ్యే లక్షణాలున్నాయి. భవిష్యత్‌లో నా సినిమాలో అతిథి పాత్ర ఇస్తా. ఐ లవ్యూ’ అని పూరి ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-05-11T09:55:56+05:30 IST