శ్రీశాంత్‌పై ఏడేళ్ల నిషేధం ముగిసె..

ABN , First Publish Date - 2020-09-14T09:35:41+05:30 IST

శ్రీశాంత్‌పై ఏడేళ్ల నిషేధం ముగిసె..

శ్రీశాంత్‌పై ఏడేళ్ల నిషేధం ముగిసె..

న్యూఢిల్లీ: భారత పేసర్‌ శ్రీశాంత్‌పై కొనసాగుతున్న ఏడేళ్ల నిషేధం ఆదివారంతో ముగిసింది. 2013 ఐపీఎల్‌లో వెలుగుచూసిన స్పాట్‌ ఫిక్సింగ్‌లో శ్రీశాంత్‌ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడంతో అతడిపై వేటు పడింది. అప్పట్లో బీసీసీఐ జీవితకాల నిషేధం విధించినా గతేడాది సుప్రీంకోర్టు అతడి శిక్షాకాలంపై పునరాలోచించాలని సూచించింది. దీంతో అతడి శిక్షాకాలాన్ని బీసీసీఏ ఏడేళ్లకు పరిమితం చేసింది. ‘నాకిప్పుడు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఇక నాకెంతో ఇష్టమైన క్రికెట్‌ ఆడేందుకు ఎలాంటి అడ్డంకి లేదు. ఇంకో ఐదు నుంచి ఏడేళ్ల పాటు ఆడగల సత్తా నాలో ఉంది. ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహించినా శాయశక్తులా పోరాడతా’ అని 37 ఏళ్ల శ్రీశాంత్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated Date - 2020-09-14T09:35:41+05:30 IST