2011 ప్రపంచకప్ ఫైనల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తునకు శ్రీలంక ఆదేశం

ABN , First Publish Date - 2020-06-20T04:35:31+05:30 IST

భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ గుర్తుందా? చివరకు కళ్లు చెదిరే సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన...

2011 ప్రపంచకప్ ఫైనల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు.. దర్యాప్తునకు శ్రీలంక ఆదేశం

కొలంబో: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ గుర్తుందా? చివరకు కళ్లు  చెదిరే సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన టీమిండియా కెప్టెన్ ధోనీ.. కప్పు కూడా కొట్టేశాడు. 28ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ను భారత్ గెలవడంపై క్రికెట్ ప్రేమికులంతా సంతోషం వ్యక్తంచేశారు. అయితే ఈ మ్యాచ్ ఫిక్సయిందంటూ శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి  మహిందనంద అలుత్‌గమాగే ఆరోపణలు చేశారు. ‘కొన్ని పార్టీలు కలిసి శ్రీలంక ఓడిపోవాలని ముందే మ్యాచ్‌ను ఫిక్స్ చేశాయి’ అని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం సదరు అంశంపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మేరకు శ్రీలంక ప్రస్తుత క్రీడాశాఖ మంత్రి డల్లాస్ అలహప్పెరుమ ఆదేశాలు జారీచేశారు. అలాగే ఈ దర్యాప్తు పురోగతిపై ప్రతి రెండువారాలకు నివేదిక అందించాలని సూచించారు.

Updated Date - 2020-06-20T04:35:31+05:30 IST