‘పద్మశ్రీ’ వాపస్‌

ABN , First Publish Date - 2020-12-05T07:11:18+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు క్రీడారంగం నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది. శుక్రవారం భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ పర్గత్‌ సింగ్‌...

‘పద్మశ్రీ’ వాపస్‌

  • హాకీ మాజీ కెప్టెన్‌ పర్గత్‌ 


న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు క్రీడారంగం నుంచి క్రమంగా మద్దతు పెరుగుతోంది. శుక్రవారం భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ పర్గత్‌ సింగ్‌, జాతీయ బాక్సింగ్‌ మాజీ కోచ్‌ గుర్‌బక్స్‌సింగ్‌ సంధూ సంఘీభావం ప్రకటించారు. తమ పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని పర్గత్‌, గుర్‌బక్స్‌ నిర్ణయం తీసుకున్నారు. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న పర్గత్‌ కాంగ్రెస్‌ తరపున జలంధర్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1998లో తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఈనెల 9న ప్రభుత్వానికి వాపసు చేయనున్నట్టు పర్గత్‌ వెల్లడించాడు. ఇక.. అర్జున అవార్డు గ్రహీతలు సజ్జన్‌సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), రాజ్‌బీర్‌ (హాకీ) తదితరులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే


Updated Date - 2020-12-05T07:11:18+05:30 IST