దశల వారీగా క్రీడాకారుల శిక్షణ పునర్ ప్రారంభం...కేంద్ర క్రీడాశాఖ మంత్రి ప్రకటన

ABN , First Publish Date - 2020-05-11T11:44:43+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిలిచిపోయిన క్రీడాకారుల శిక్షణ శిబిరాలు దశలవారీగా పునర్ ప్రారంభిస్తామని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు....

దశల వారీగా క్రీడాకారుల శిక్షణ పునర్ ప్రారంభం...కేంద్ర క్రీడాశాఖ మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిలిచిపోయిన క్రీడాకారుల శిక్షణ శిబిరాలు దశలవారీగా పునర్ ప్రారంభిస్తామని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి అథ్లెట్లను కలిసి మాట్లాడారు. దేశంలోని వెయిట్ లిఫ్టర్లకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించామని మంత్రి చెప్పారు. ట్రాక్ అండ్ ఫీల్డు అథ్లెట్లకు మంగళవారం నుంచి క్రీడల శిక్షణ ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వివరించారు. క్రీడల శిక్షణ శిబిరాలు ప్రారంభం అవడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-11T11:44:43+05:30 IST