బెంగాల్ క్రికెటర్లకు ‘కరోనా’ ఇన్సూరెన్స్
ABN , First Publish Date - 2020-03-24T10:35:39+05:30 IST
బెంగాల్ క్రికెటర్లకు ‘కరోనా’ ఇన్సూరెన్స్

కోల్‌కతా: కరోనా బారిన పడిన వారికి కూడా చికిత్సలు అందించేలా తమ ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులకు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ సదుపాయాన్ని కల్పించనుంది. మొత్తం 3200 మందికి దీనిద్వారా రక్షణ లభిస్తుందని క్యాబ్ ప్రకటించింది. బెంగాల్ తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లకు కూడా ఈ పాలసీ వర్తిస్తుందని క్యాబ్ ప్రకటించింది.