బజ్‌రంగ్‌ ఆరునెలల వేతనం విరాళం

ABN , First Publish Date - 2020-03-24T10:34:20+05:30 IST

బజ్‌రంగ్‌ ఆరునెలల వేతనం విరాళం

బజ్‌రంగ్‌ ఆరునెలల వేతనం విరాళం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వానికి భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా మద్దతుగా నిలిచాడు. ఇందుకోసం తన ఆరునెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు గతేడాది ప్రపం చ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత అయిన బజ్‌రంగ్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో బజ్‌రంగ్‌ను కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు అభినందించారు. 25 ఏళ్ల బజ్‌రంగ్‌ ప్రస్తుతం రైల్వే శాఖలో స్పెషల్‌ డ్యూటీ ఆఫీసర్‌ (ఓఎస్డీ)గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. కరో నా వైరస్‌ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని బజ్‌రంగ్‌ డిమాండ్‌ చేశాడు. 

Read more