ఐసీసీ కార్యాలయం మూసివేత
ABN , First Publish Date - 2020-03-24T10:33:39+05:30 IST
ఐసీసీ కార్యాలయం మూసివేత

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా కొవిడ్-19 నివారణ చర్యలు చేపట్టింది. దుబాయ్‌లోని తమ ప్రధాన కార్యాలయాన్ని మూసేసి అధికారులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా సూచించింది. దీంతో ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, సీఈ మను సహానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాల్లో పాల్గొనాలనుకుంటున్నారు.