మే తొలి వారంలోనైనా మేం రెడీ!

ABN , First Publish Date - 2020-03-24T10:33:11+05:30 IST

మే తొలి వారంలోనైనా మేం రెడీ!

మే తొలి వారంలోనైనా మేం రెడీ!

ముంబై: దేశంలో కరోనా తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. దీంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వచ్చే నెలాఖరు వరకు పరిస్థితులు మెరుగైతే మే తొలి వారంలో లీగ్‌ను ఆరంభించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ ఇప్పుడున్న స్థితిలో ఐపీఎల్‌ భవితవ్యంపై ఏమీ చెప్పలేమని ఓ అధికారి వ్యాఖ్యానించాడు. ‘లీగ్‌ విషయంలో వచ్చే నెలాఖరు వరకు వేచి చూడాలనుకుంటున్నాం. ఒకవేళ మే తొలి వారంలో కూడా నిర్వహించలేకపోతే ఇక ఈ ఏడాదికి ఆశలు వదులుకోవాల్సిందే. పరిస్థితులు అనుకూలిస్తే అప్పట్లో దక్షిణాఫ్రికాలో జరిపినట్టు 37 రోజుల్లో 59 మ్యాచ్‌లు ఆడిస్తాం. అయితే ఇలాంటి సందర్భంలో దేశమంతా పర్యటించలేం. మహారాష్ట్రలో ఉన్న నాలుగు స్టేడియాలను వినియోగించుకుంటే ప్రయాణ భారం తగ్గుతుంది. అయితే అన్నింటికన్నా ప్రజల ఆరోగ్య భద్రతే ముఖ్యం’ అని బోర్డు అధికారి స్పష్టం చేశారు.


Read more