చాంపియన్‌ కరాచీ కింగ్స్‌

ABN , First Publish Date - 2020-11-19T08:57:54+05:30 IST

చాంపియన్‌ కరాచీ కింగ్స్‌

చాంపియన్‌ కరాచీ కింగ్స్‌

కరాచీ:  పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌ జట్టు తొలి టైటిల్‌ కైవసం చేసుకొంది. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో కరాచీ 5 వికెట్లతో లాహోర్‌ ఖలాండర్స్‌పై గెలిచి.. చాంపియన్‌గా నిలిచింది. తొలుత తమీమ్‌ ఇక్బాల్‌ (35), ఫఖర్‌ జమాన్‌ (27) రాణించడంతో లాహోర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. వకాస్‌ మక్సూద్‌ (2/18), ఉమైద్‌ ఆసిఫ్‌ (2/18), అర్షద్‌ ఇక్బాల్‌ (2/26) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (63 నాటౌట్‌) అర్ధ సెంచరీతో రాణించడంతో కరాచీ జట్టు 18.4 ఓవర్లలో 135/5 స్కోరు చేసి అలవోకగా నెగ్గి ట్రోఫీ దక్కించుకొంది. దిల్‌బర్‌ హుస్సేన్‌ (2/28), హారిస్‌ రౌఫ్‌ (2/30) చెరో రెండు వికెట్లు తీశారు. ఆజమ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌స’గా నిలిచాడు. 

Updated Date - 2020-11-19T08:57:54+05:30 IST