ఇదే ఫైనల్ వార్నింగ్
ABN , First Publish Date - 2020-10-07T09:25:27+05:30 IST
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఫించ్‌ను మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా స్పిన్నర్ అశ్విన్ హెచ్చరించి వదిలేశాడు.

మన్కడింగ్‌పై అశ్విన్
దుబాయ్: బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఫించ్‌ను మన్కడింగ్ చేసే అవకాశం వచ్చినా స్పిన్నర్ అశ్విన్ హెచ్చరించి వదిలేశాడు. కానీ మరోసారి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం అవకాశాన్ని వదులుకోనని స్పష్టం చేశాడు. ‘నేనో విషయాన్ని చెప్పదలుచుకున్నా.
ఈ ఏడాదిలో ఇదే నా మొదటి, చివరి హెచ్చరిక. ఇంకెవరైనా అలా క్రీజు వదిలి ముందుకు వస్తే కచ్చితంగా మన్కడింగ్ చేస్తా. అధికారికంగానే ఈ విషయం చెబుతున్నా. ఆ తర్వాత నన్ను నిందించవద్దు’ అని పాంటింగ్, ఫించ్‌ను ట్యాగ్ చేస్తూ అశ్విన్ ట్వీట్ చేశాడు. చివర్లో తాము స్నేహితులమేనంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో తమ ఆటగాళ్లు మన్కడింగ్ చేయకూడదని ఢిల్లీ చీఫ్ కోచ్ పాంటింగ్ ఇదివరకే చెప్పాడు. అందుకే అశ్విన్ తనకు వచ్చిన అవకాశాన్ని హెచ్చరికతో వదిలేశాడు.