దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ తొలి వన్డే రద్దు
ABN , First Publish Date - 2020-12-07T10:17:16+05:30 IST
దక్షిణాఫ్రికాలో ఇంగ్లండ్ జట్టు పర్యటనను కరోనా కలవరపెడుతోంది. తాజాగా మరో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడడంతో.. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో ఇంగ్లండ్ జట్టు పర్యటనను కరోనా కలవరపెడుతోంది. తాజాగా మరో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు బయటపడడంతో.. మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ మధ్య రీషెడ్యూల్ (ఆదివారానికి) అయిన తొలి మ్యాచ్‌ను రద్దు చేసినట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లండ్ బృందానికి మరోసారి నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో.. బయో సెక్యూర్ వాతావరణంలో ఉంటున్న ఇద్దరు హోటల్ ఉద్యోగులకు పాజిటివ్ అని వచ్చింది. ఇరుజట్ల ఆటగాళ్లకు వీరు సేవలు అందించారు.