ఆస్ట్రేలియా వైట్‌వాష్
ABN , First Publish Date - 2020-03-08T09:48:01+05:30 IST
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య దక్షిణాఫ్రికా 3-0తో వైట్‌వాష్ చేసింది. శనివారం జరిగిన ...

పోచెఫ్‌స్ట్రూమ్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య దక్షిణాఫ్రికా 3-0తో వైట్‌వాష్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి, మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో ఆసీ్‌సను చిత్తు చేసింది. లబుషేన్ (108) కెరీర్ తొలి శతకంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 7 వికెట్లకు 254 రన్స్ చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 258/4 స్కోరు చేసి నెగ్గింది. స్మట్స్ (84), క్లాసెన్ (68 నాటౌట్) రాణించారు.