14 ఏళ్ల తర్వాత పాక్‌కు సఫారీలు
ABN , First Publish Date - 2020-12-10T09:03:22+05:30 IST
దక్షిణాఫ్రికా జట్టు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించనుంది. వచ్చే జనవరి-ఫిబ్రవరిలో పాక్‌తో సౌతాఫ్రికా రెండు టెస్టు లు, మూడు టీ20ల సిరీ్‌సలో పోటీ పడనుంది...

కరాచీ: దక్షిణాఫ్రికా జట్టు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో పర్యటించనుంది. వచ్చే జనవరి-ఫిబ్రవరిలో పాక్‌తో సౌతాఫ్రికా రెండు టెస్టు లు, మూడు టీ20ల సిరీ్‌సలో పోటీ పడనుంది. సఫారీలు జనవరి 16న కరాచీ చేరుకోనున్నట్టు పాక్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. కరాచీలో 26 నుంచి జరిగే తొలి టెస్టుతో సౌతాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 11 నుంచి టీ20లు జరుగుతాయి.